News August 31, 2024

దోషుల్ని శిక్షించాలంటూ నేడు మమత ధర్నా

image

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు ఆందోళన చేపట్టాలని టీఎంసీ శ్రేణులకూ పిలుపునిచ్చారు. ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార దోషులకు మరణ దండన విధించాలని, రేప్ కేసుల్లో కఠినశిక్షలు పడేలా కేంద్ర చట్టాలను సవరించాలన్న డిమాండ్లతో ఆమె ఈ నిరసన చేపడుతున్నారు. మరోవైపు విద్యార్థులపై ఆమె నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా బీజేపీ ఏడు రోజుల ధర్నాకు పిలుపునివ్వడం గమనార్హం.

Similar News

News January 30, 2026

ఇన్‌స్టాగ్రామ్‌కు విరాట్ కోహ్లీ గుడ్ బై?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన అకౌంట్‌లో యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫ్యాన్స్ SMలో పోస్ట్ చేస్తున్నారు. అకౌంట్ టెంపరరీగా డీయాక్టివేట్ అయిందా? లేదా కోహ్లీనే చేసి ఇన్‌స్టాకి గుడ్ బై చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. ఆయనకు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

News January 30, 2026

ఊపిరితిత్తులు లేకుండా 48 గంటలు బతికాడు!

image

ఓ 33 ఏళ్ల వ్యక్తి లంగ్స్ లేకుండా 48hrs బతికాడు. చికాగో నార్త్‌వెస్టర్న్ వర్సిటీ వైద్యులు ఆర్టిఫిషియల్ లంగ్ సిస్టమ్‌‌ను అమర్చి ఆక్సిజన్ అందిస్తూ గుండెకి రక్త ప్రసరణ చేయడంతో ఇది సాధ్యమైంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌ వల్ల రోగి లంగ్స్‌ పూర్తిగా పాడవడంతో డాక్టర్లు వాటిని తొలగించారు. 48hrs తర్వాత డోనర్ దొరకడంతో విజయవంతంగా డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు Med జర్నల్‌ పేర్కొంది.

News January 30, 2026

3 భాషల్లో ‘ధురంధర్’ స్ట్రీమింగ్

image

సూపర్ హిట్ మూవీ ‘ధురంధర్’ Netflixలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో హిందీలో మాత్రమే రిలీజైన ఈ మూవీ OTTలో తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ వెర్షన్ రన్ టైమ్ 3.34hrs ఉండగా OTTలో 3.25hrsకి తగ్గించారు. 2025 DEC 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1350Cr+ వసూలు చేసింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించారు. INDలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమా ఇదే.