News August 31, 2024
సూర్యకుమార్ యాదవ్‌కు గాయం

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డారు. బుచ్చిబాబు టోర్నమెంట్లో భాగంగా TNCA XIతో జరిగిన మ్యాచ్‌లో ఆయన చేతి వేలికి గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆయన బ్యాటింగ్‌కు దిగలేదు. గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సూర్యను ఎంపిక చేయాలని BCCI భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన గాయపడటం భారత్‌కు నష్టమేనని ఫ్యాన్స్ అంటున్నారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.
News January 15, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు

<
News January 15, 2026
పండుగ వేళ ఖాతాల్లోకి డబ్బులు

AP: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న DA, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఒక్కో ఉద్యోగికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు అకౌంట్లో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్ బిల్లులు రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.


