News August 31, 2024
ఆరెంజ్ అలర్ట్: 5 జిల్లాల్లో భారీ వర్షాలు

TGలోని 5 జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. HYD, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, KNR, ఖమ్మం, మహబూబాబాద్, MBNR, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, VKB, వనపర్తి, WGL, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<


