News August 31, 2024

ఆ ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దు: లోకేశ్

image

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు. కొండచరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ, విపత్తు నిర్వహణ శాఖ పంపే అలర్ట్ మెసేజ్‌లను గమనిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాధితులకు సహాయం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 1, 2025

శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య

image

భార్య శోభిత సలహాల్ని తాను అనుసరిస్తుంటానని నటుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడు నా ఆలోచనను శోభితతో పంచుకుంటుంటాను. ఒత్తిడిలో ఉన్నానంటే ఇట్టే గుర్తుపట్టేసి ఏమైందని అడుగుతుంది. తను ఎప్పుడూ ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తుంది. మంచి సలహాలిస్తుంది. అందుకే తన అభిప్రాయాల్ని నేను చాలా గౌరవిస్తాను’ అని కొనియాడారు.

News February 1, 2025

పాత Income Tax పద్ధతికి ఇక గుడ్‌బై!

image

కొత్త Income Tax విధానంలో రూ.12.75L వరకు ట్యాక్స్ లేకపోవడంతో ఇక పాత పద్ధతి మురిగిపోయినట్టే! ఇందులో శ్లాబు రేట్లను యథాతథంగా ₹2.5L వరకు 0, ₹2.5L- ₹3L వరకు 5%, ₹3L- ₹5L వరకు 5%, ₹5L- ₹10L వరకు 20%, ₹10L పైన 30% వద్దే ఉంచేశారు. ఇందులో బెనిఫిట్స్ రావాలంటే HRA, హోమ్ లోన్స్, SEC 80C కింద క్లెయిమ్స్ చేసుకోవాలి. లేదంటే రూ.వేల నుంచి లక్షల్లో పన్ను కట్టాల్సిందే. అందుకే కొత్త ITకే అందరూ మొగ్గు చూపడం ఖాయం.

News February 1, 2025

Income Tax: ఎవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందంటే..

image

కొత్త పన్ను విధానంలో ప్రస్తుత శ్లాబుల ప్రకారం ₹8L ఆదాయముంటే ₹30K, ₹9Lకు ₹40K, ₹10Lకు ₹50K, ₹11Lకు ₹65K, ₹12Lకు ₹80K పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు SD, రిబేటుతో కలిపి ₹12.75L వరకు పన్ను లేదు కాబట్టి ఆ మేరకు లబ్ధి కలిగినట్టే. గతంతో పోలిస్తే ఇక నుంచి ₹16Lకు ₹50K, ₹20Lకు ₹90K, ₹24Lకు ₹1.10L, ₹50Lకు ₹1.10L మేర ట్యాక్స్ బెనిఫిట్ కల్పించారు. అంటే వీరికి సగటున ఏటా 30% డబ్బు ఆదా అవుతున్నట్టే.