News August 31, 2024

‘హైడ్రా OK.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చొద్దు’

image

పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 3, 2026

లింగంపల్లి-ఉప్పల్: ​నిధుల కరవు.. అధికారాల పరువు!

image

శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్ దాకా అతుకుల రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీలే దర్శనమిస్తున్నాయి. సుమారు రూ. 14,725 కోట్ల పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రతి వానాకాలం వేలాది కుటుంబాలు ముంపులోనే బతుకుతున్నాయి. విచిత్రమేంటంటే.. ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేసే అధికారం లేదు. అంటే, ఒక చిన్న డ్రైనేజీ కాలువ పూడిక తీయాలన్నా పైస్థాయి నుంచి <<18752122>>పచ్చజెండా<<>> రావాల్సిందే.

News January 3, 2026

హైదరాబాద్ చుట్టూ ‘నరక’ కూపాలు!

image

హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మెట్రో రైళ్లే అనుకుంటున్నారా? నగరం చుట్టూ కొత్తగా చేరిన ఆ 27 మున్సిపాలిటీల (ULBs) వైపు వెళ్తే.. ‘అభివృద్ధి’ అనే మాటకే అర్థం మారిపోతోంది! 1,324 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తుంటే.. భవిష్యత్తులో ఇవి మురికివాడలుగా మారతాయా? అన్న భయం వేస్తోంది.

News January 3, 2026

HYD: మూడు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలనేదే ప్లాన్

image

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని గాంధీభవన్ వర్గాలు నేతలకు దిశానిర్దేశం చేశాయి. జూబ్లీహిల్స్ గెలుపు స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను వివరించాలని అధిష్ఠానం సూచించింది. అధిక స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించి, నగర రాజకీయాలపై పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.