News August 31, 2024
భారీ వర్షాలు.. పింఛన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
AP: భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే 2,3 రోజుల్లో వారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దీన్నిబట్టి ఇవాళ పింఛన్ అందనివారికి రేపు, ఎల్లుండి పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వెల్లడించారు.
Similar News
News January 15, 2025
కేటీఆర్‌కు మరోసారి నోటీసులు?
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.
News January 15, 2025
‘డాకు మహారాజ్’ 10 లక్షల టికెట్స్ సోల్డ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా అదరగొడుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ దబిడి దిబిడి’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News January 15, 2025
BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట
AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.