News August 31, 2024
హైడ్రా దూకుడు.. ఆరుగురు అధికారులపై కేసులు

TG: హైదరాబాద్‌లో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన ‘హైడ్రా’ దూకుడు పెంచింది. ఫలితంగా ఆరుగురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, HMDA ఏపీఓ, బాచుపల్లి తహశీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై EAO (ఆర్థిక నేర విభాగం)లో ఫిర్యాదు చేసింది. వీరంతా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని తెలుస్తోంది.
Similar News
News January 21, 2026
కర్ణాటక అసెంబ్లీలో ప్రసంగానికి నో చెప్పిన గవర్నర్

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రారంభ ఉపన్యాసం చేయడానికి నిరాకరించారు. ఈనెల 22-31వ తేదీ వరకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని ఈరోజు ఉదయం CM సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. నరేగా పథకం పేరు మార్పు, ఉపాధి హామీ చట్టం రక్షణపై చర్చిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
News January 21, 2026
టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా?

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. అనునయంగా మాట్లాడి సమాచారాన్ని రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.
News January 21, 2026
‘లైఫ్ సైన్సెస్’లో $25B పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం: CM

TG: దావోస్‌లో CM రేవంత్ నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించారు. దీనికింద 2030 నాటికి $25B పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ORR వెంబడి 10 ఫార్మా విలేజ్‌లు, గ్రీన్ ఫార్మా సిటీ, వైద్య పరికరాల పార్కును కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. జీనోమ్ వ్యాలీని మరింతగా విస్తరించనుంది. లైఫ్ సైన్సెస్ కోసం రూ.1000 కోట్ల ఇన్నోవేషన్ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు.


