News August 31, 2024

FLASH: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు PINK ALERT⚠️

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News March 11, 2026

MP అర్వింద్ ఆతిథ్యం అద్భుతం: నారా లోకేశ్

image

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆతిథ్యం అద్భుతమని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఓ సమ్మిట్ కోస ఢిల్లీ వెళ్లిన లోకేశ్‌ను అర్వింద్ తన ఇంటికి ఆహ్వానించారు. “అద్భుతమైన భోజనం, అంతకు మించిన మంచి స్నేహంతో గడిపిన సమయం చిరస్మరణీయం. మీ ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకం, మీ అభిమానిగా మారిపోయాను” అంటూ విందులో పాల్గొన్న లోకేశ్ తన సంతోషాన్ని పంచుకున్నారు.

News March 11, 2026

మోపాల్: కాలికి వల చుట్టుకొని వ్యక్తి మృతి

image

మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన ముజిగా శ్యామ్ (43) మత్స్యకారుడు ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు SI సుస్మిత తెలిపారు. జీవనోపాధి కోసం ఎన్.ఎస్.పి కెనాల్ వద్ద పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ ఆయన కాలికి ఉడెన్ వల చుట్టుకొని కెనాల్ నీటిలో జారి పడటం వల్ల మృతి చెందడన్నారు. మృతుడి కోడలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.

News March 11, 2026

NZB: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

image

NZB జిల్లాలో ఈనెల 14 నుంచి SSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటును చేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య:24,399
అబ్బాయిలు:12,244,
అమ్మాయిలు:12,155,
పరీక్షా కేంద్రాల సంఖ్య:144
చీఫ్ సూపరింటెండెంట్ల:144
డిపార్ట్‌మెంటల్ అధికారుల:144
ఇన్విజిలేటర్లు: 1,214 ఉన్నారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం
జిల్లా హెల్ప్ లైన్ నంబర్: 9030282993ను ఏర్పాటు చేశారు.