News August 31, 2024

పవన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

image

SEP 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘ఓజీ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇవాళ ఓ పోస్టర్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పవన్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Similar News

News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి కేటాయింపులు ఇలా..

image

ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr

News February 1, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురు‌కాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.

News February 1, 2025

ఎల్లుండి ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్

image

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి ఎల్లుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ కానుంది. రెండు రోజుల్లో రెబల్ స్టార్ లుక్ రివీల్ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. గతంలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ పాత్రలో అక్షయ్ కుమార్ పోస్టర్ రిలీజైంది. దీంతో ప్రభాస్ పాత్రతో పాటు లుక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.