News August 31, 2024
వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు దుర్మరణం
AP: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాన్విక్ మరణించారు. కాగా విజయవాడలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు <<13984102>>దుర్మరణం<<>> పాలైన విషయం తెలిసిందే.
Similar News
News February 1, 2025
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఇలా..
ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr
News February 1, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.
News February 1, 2025
ఎల్లుండి ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి ఎల్లుండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ కానుంది. రెండు రోజుల్లో రెబల్ స్టార్ లుక్ రివీల్ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. గతంలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ పాత్రలో అక్షయ్ కుమార్ పోస్టర్ రిలీజైంది. దీంతో ప్రభాస్ పాత్రతో పాటు లుక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.