News August 31, 2024
విమానం గాల్లో ఉండగా ఒక ఇంజిన్ ఫెయిల్..

కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. 6E 0573 గాల్లో ఉండగా ఒక ఇంజిన్ ఫెయిల్ అయినట్టు పైలట్ గుర్తించారు. దీంతో రాత్రి 10.39కి పైలట్ ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో రన్‌వేపై ఎమర్జెన్సీని ప్రకటించారు. రెండో ఇంజిన్‌తో విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
Similar News
News August 31, 2025
బదోనీ ‘డబుల్’ బాదుడు.. సెమీస్‌కు నార్త్ జోన్

దులీప్ ట్రోఫీలో భాగంగా క్వార్టర్ ఫైనల్-1లో నార్త్ జోన్ ప్లేయర్ ఆయుష్ బదోనీ(204*) డబుల్ సెంచరీతో రెచ్చిపోయారు. ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో 223 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో ద్విశతకం బాదారు. ఫస్ట్ ఇన్నింగ్సులోనూ బదోనీ 63 పరుగులు సాధించారు. యశ్ ధుల్, అంకిత్ కుమార్ కూడా శతకాలు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నార్త్ జోన్ నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
News August 31, 2025
జనసేన జాతీయ, టీడీపీ అంతర్జాతీయ పార్టీలు: పేర్ని సెటైర్స్

AP: జనసేన జాతీయ పార్టీ, TDP అంతర్జాతీయ పార్టీ అని YCP నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. జనసేన సిద్ధాంతాలు అర్థంకాక ఆ పార్టీ నేతలే సతమతం అవుతున్నారని తెలిపారు. సుగాలి ప్రీతి పేరును వాడుకుని పవన్ రాజకీయాల్లో ఎదిగారని విమర్శించారు. ‘ప్రీతి కుటుంబానికి న్యాయం చేసింది YS జగనే. ఆమె కుటుంబానికి పవన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఆ కేసులో ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు.. చంద్రబాబును’ అని ఫైర్ అయ్యారు.
News August 31, 2025
రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

AP: రేషన్ షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు(D) తెనాలి(M) నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ‘ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం. నిన్నటి నుంచి కాకినాడ, ELR, GNT, చిత్తూరు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించాం. సెప్టెంబర్ 15 నాటికి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.