News August 31, 2024
HYD: రెయిన్ అలర్ట్.. మేయర్ సమీక్షా సమావేశం
రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాల కురిసే అవకాశమున్నందున హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం GHMC కమిషనర్ ఆమ్రపాలి, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల పట్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సేవలకై 040-21111111, 9000113667 నంబర్లలకు సంప్రదించాలన్నారు.
Similar News
News November 26, 2024
HYDలో పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్లో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
News November 26, 2024
HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్న్యూస్
ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT
News November 25, 2024
HYD: 3.5 లక్షల కుటుంబాలు ఉచిత తాగునీటికి దూరం
GHMC పరిధిలో మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఉచిత తాగునీరు పథకం ఇంకా అర్హులకు పూర్తిగా అందడం లేదు. అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. నగరంలో 9,73,873 అర్హులైన కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 6,14,497 కుటుంబాలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇంకా 3,59,376 కుటుంబాలకు ఉచిత తాగునీరు అందటం లేదు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.