News August 31, 2024

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

రాబోయే రెండు మూడు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటల నీటి ప్రవాహం గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నుంచి వరంగల్ రహదారిలో వెళ్లే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

Similar News

News January 12, 2026

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

image

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.

News January 12, 2026

జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

image

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.

News January 12, 2026

MDK: పోలీసుల అప్రమత్తతతో తప్పిన విషాద ఘటన

image

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం సమీపంలోని ఘనపూర్ ఆనకట్ట వద్ద కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్యను QRT-1 టీమ్ ప్రాణాలకు తెగించి కాపాడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT-1 సిబ్బంది ఏఆర్‌ ఎస్‌ఐలు శ్రీనివాస్, సాయిలు తదితరులు నది ప్రవాహంలోకి వెళ్లి తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారి ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు.