News August 31, 2024
వీకెండ్లో ఎక్కువసేపు నిద్రపోయే వారికి GOOD NEWS

వీకెండ్(శని, ఆదివారం)లో ఎక్కువ సేపు నిద్రపోవడం చాలా మందికి అలవాటు. అలాంటి వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20% తగ్గుతుందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం వెల్లడించింది. 14 ఏళ్లపాటు 91వేల మంది డేటాను పరిశీలించి ఈ వివరాలు తెలిపింది. ‘మనిషికి 6-7గంటల నిద్ర అవసరం. కానీ పని ఒత్తిడితో నాణ్యమైన నిద్ర దొరకట్లేదు. వారంతంలో దాన్ని భర్తీ చేయడం వల్ల హార్ట్ అటాక్ ముప్పు తగ్గుతుంది’ అని పేర్కొంది.
Similar News
News July 6, 2025
రోజుకు 9 గంటల నిద్ర.. రూ.9 లక్షలు గెలిచింది

ఎక్కువ సమయం నిద్రపోతే బద్దకం వస్తుందని ఇంట్లో వాళ్లు తిడుతుంటారు. కానీ పుణేకు చెందిన పూజా రోజుకు 9 గంటలు నిద్రిస్తూ రూ.9.1 లక్షలు గెలిచారు. ఓ పరుపుల కంపెనీ నిర్వహించిన పోటీలో పాల్గొని, 60 రోజులు సగటున 9 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రించారు. నిద్రలేమిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఇంటర్న్‌షిప్‌లో లక్ష మందిలో 15 మంది తుదిపోరులో నిలిచారు. వీరిలో బెస్ట్ స్కోర్‌తో పూజా నగదు గెలిచారు.
News July 6, 2025
రాష్ట్రంలో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు

AP: రాష్ట్రవ్యాప్తంగా HD బర్లీ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇంకొల్లు, పంగులూరు, పర్చూరు, బీకేపాలెం, చీరాల, గుంటూరు, పెదకాకాని, చిలకలూరిపేట, ఎడ్లపాడు, గుండ్లపల్లి కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ17.20 కోట్ల విలువైన 2245 బేళ్ల పొగాకు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. రైతులకు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
News July 6, 2025
వర్షంలో తడుస్తున్నారా?

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.