News September 1, 2024
ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
AP: విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కృష్ణా నది ఉద్ధృతి కొనసాగుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,02,194 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,56,024, ఔట్ ఫ్లో 5,00,397, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4,61,245, ఔట్ ఫ్లో 4,53,700 క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3,39,434, ఔట్ ఫ్లో 3,14,434 క్యూసెక్కులుగా ఉంది.
Similar News
News January 15, 2025
దేశంలో ఎన్నో సమస్యలుంటే.. సైకిల్ ట్రాక్‌లు కావాలా?: సుప్రీంకోర్టు
‘దేశంలో పేదలకు సరైన నివాస వసతి లేదు. మురికివాడల్లో నివసిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవల కొరత ఉంది. ప్రభుత్వాలు వీటి కోసం నిధులు ఖర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్‌ల కోసమా?’ అని SC ప్రశ్నించింది. దేశంలో సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలన్న పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామని SC ప్రశ్నించింది.
News January 15, 2025
భారత్ ఘన విజయం
ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
News January 15, 2025
ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు
మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబా, 32 ఏళ్లుగా స్నానం ఆచరించని 3.8 ఫీట్ బాబా, తలపై 2 లక్షల రుద్రాక్షలు ధరించిన గీతానంద గిరి బాబా, తలపై పావురం కలిగి ఉన్న మహంత్ రాజ్‌పురీ జీ మహారాజ్ ఉన్నారు.