News September 1, 2024
ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సత్కారం

పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన పలువురు అధికారులను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగుల సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ఏ అవసరం ఉన్నా స్వయంగా వచ్చి తనను కలవవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.
Similar News
News January 11, 2026
భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
News January 10, 2026
ప.గో: కోట్లల్లో పందేలు.. ఎందుకంటే!

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలోని జూదరలు రూ.కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
News January 10, 2026
మొగల్తూరు: కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోండి

పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరి చూసుకుని కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. శనివారం మొగల్తూరు మండలం శేరేపాలెం రెవెన్యూ విలేజ్ కొత్తపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులను కలిసి జేసీ మాట్లాడారు. పాసు పుస్తకాలలో ఉన్న ఫొటో, పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం, ఆధార్ నంబరు, వంటివి ఏమైనా తప్పిదాలు ఉంటే పరిశీలించుకుని సరి చేయించుకోవాలన్నారు.


