News September 1, 2024
నేడు తీరం దాటనున్న వాయుగుండం
AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నానికి దక్షిణంగా 30కి.మీ, విశాఖకు ఈశాన్యంగా 90కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
Similar News
News February 1, 2025
తులం బంగారం ఏదని నిలదీయాలి: KTR
TG: రాష్ట్రంలో 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని సవాల్ చేశానని, దానిపై సీఎం రేవంత్ స్పందించలేదని KTR అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు కూడా బీఆర్ఎస్ కూడబెట్టినవే అని చెప్పారు. ‘రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి కూడా రైతుబంధు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు డ్రామా. ఎకరాకు రూ.17,500 ఇచ్చేదాకా వదిలిపెట్టొద్దు. తులం బంగారం ఏదని మహిళలు నిలదీయాలి’ అని KTR అన్నారు.
News February 1, 2025
కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?
యావత్ దేశం మొత్తం ఎదురుచూసే బడ్జెట్ వచ్చేసింది. ₹50.65 లక్షల కోట్లతో పద్దులను నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ₹12 లక్షల ఆదాయం వరకు పన్ను లేకపోవడం, క్యాన్సర్ సహా 36 ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తొలగించడం, బీమా రంగంలో 100% FDI పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని ₹3 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంచడం, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌పై మీ కామెంట్ ప్లీజ్.
News February 1, 2025
AP పట్ల కేంద్రానికి ఇంతటి నిర్లక్ష్యమెందుకు?: జైరామ్ రమేశ్
కేంద్ర ప్రభుత్వం బిహార్‌కు బొనాంజా ప్రకటించి కూటమిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం అత్యంత క్రూరంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ ట్విటర్లో విమర్శించారు. ‘త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి బిహార్‌కు కేంద్రం వరాలు కురిపించింది. అది సహజమే. కానీ ఎన్డీయేకు మూలస్తంభంలా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకంత క్రూరంగా నిర్లక్ష్యం చేసింది?’ అని ప్రశ్నించారు.