News September 1, 2024

మదనపల్లెలో యువకుడి మృతి.. ఆచూకీ లభ్యం

image

మదనపల్లె బెంగుళూరు రోడ్డులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించినట్లు తాలూక ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. నిమ్మనపల్లె మండలం చౌకిల్లపల్లెకు చెందిన శివ(30) బెంగళూరు నుంచి బైకుపై స్వగ్రామానికి వస్తుండగా, మదనపల్లె చిప్పిలి వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. మృతునికి భార్య జ్యోతి, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

Similar News

News January 11, 2025

13న పి.జీ.ఆర్.ఎస్ రద్దు : చిత్తూరు కలెక్టర్

image

13వ తేదీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా సచివాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్  తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.

News January 10, 2025

తిరుమల: భక్తులకు క్షమాపణ చెప్పిన టీటీడీ ఛైర్మన్

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తమ తప్పులేకపోయినా భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ..క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగిరారు.ఎవరో ఏదో మాట్లాడారని స్పందించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.

News January 10, 2025

కొండంత జనం

image

తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.