News September 1, 2024
గాజాలో ఆగిన కాల్పుల మోతలు

గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచ్చింది. గాజాలో పాతికేళ్ల తర్వాత పోలియో కేసు నమోదు కావడంతో WHO టీకా డ్రైవ్ నిర్వహిస్తోంది. 6.50 లక్షల పాలస్తీనా చిన్నారులకు టీకా వేయనున్నారు. నిన్నటి నుంచే చిన్నారులకు వైద్య సిబ్బంది టీకా వేస్తూ కనిపించారు. 3 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి హమాస్-ఇజ్రాయెల్ కూడా అంగీకరించాయి.
Similar News
News November 7, 2025
నరసాపురం వరకు వందేభారత్ రైలు

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.
News November 7, 2025
తక్కువ పంటకాలం – రబీకి అనువైన వరి రకాలు

రబీ సాగుకు తక్కువ కాలపరిమితి, తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలి. అందులో కొన్ని M.T.U 1010(కాటన్ దొర సన్నాలు), M.T.U 1156( తరంగిణి), M.T.U 1153(చంద్ర), M.T.U 1293, M.T.U 1273, M.T.U 1290. వీటి పంటకాలం 120 రోజులు. వీటిలో కొన్ని పొడుగు సన్నగింజ రకాలు. దిగుబడి ఎకరాకు 3-3.2 టన్నులు. చేనుపై పడిపోవు. అగ్గితెగులును తట్టుకుంటాయి.✍️ మరిన్ని వరి రకాలు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 7, 2025
ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టండి

సాధారణంగా రాత్రుళ్లు మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, భవిష్యత్ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. ఏదైనా పనిచేశాక ఫలితాన్ని దానికే వదిలెయ్యాలి. వరుస వైఫల్యాలు ఎదురవుతోంటే మనసు గాయపడి ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కానీ వాటిని పక్కనపెట్టి తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా విజయం సాధించవచ్చని ఆలోచించండి.


