News September 1, 2024
MDK: భారీ వర్షాలు.. ‘అప్రమత్తంగా ఉండండి’

ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులను మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు అప్రమత్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
✒సంగారెడ్డి- 08455 276155
✒మెదక్- 9391942254
✒సిద్దిపేట- 8457230000, 8712667100
Similar News
News September 17, 2025
మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.
News September 17, 2025
జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.
News September 17, 2025
మెదక్: కలెక్టరేట్ త్రివర్ణమయం

17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్ మూడు రంగుల విద్యుత్ దీపాలతో త్రివర్ణ మయంగా ముస్తాబు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.