News September 1, 2024

APPLY NOW.. 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. SEP 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తై, 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. APలో 27, TGలో 19 ఖాళీలున్నాయి. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News February 1, 2025

ట్రంప్ ప్రతిపాదన తిరస్కరణ

image

గాజాలోని పాలస్తీనీయులకు పొరుగు దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించాయి. ఈ మేరకు ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, UAE, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్త ప్రకటన చేశాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారడంతో పాటు కనీస సౌకర్యాలు కరవయ్యాయని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ట్రంప్ ఇటీవల ఆయా దేశాలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

News February 1, 2025

అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

image

AP: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్న ఆయన ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20వేలు మే నెలలో అందిస్తామన్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు.

News February 1, 2025

శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్

image

తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.