News September 1, 2024

భారీ వర్షాలు.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వద్ద ఇదీ పరిస్థితి..!

image

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటలకు 35,417 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లో గా 825 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను, ప్రస్తుతం 62.144 TMCల నీరు చేరినట్లు చెప్పారు.

Similar News

News October 6, 2024

తాడ్వాయి: గ్రేట్.. మూడు ఉద్యోగాలు సాధించాడు.!

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన భూంపల్లి రాజశేఖర్ మూడు ఉద్యోగాలు సాధించాడు. SA సోషల్, SA తెలుగు, ఎస్జీటి గురుకుల టీజీటీ పోస్టులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడు పలు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News October 6, 2024

NZB: నాలుగు క్వింటాళ్ల పండ్లతో అన్నపూర్ణ దేవీగా అమ్మవారు

image

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్‌లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాలుగు క్వింటాళ్ల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చించి 15 రకాల పండ్లు కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు చేపడున్నామన్నారు.

News October 6, 2024

నిజామాబాద్: ముగ్గురు ఆత్మహత్య..UPDATE

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన <<14277266>>ముగ్గురు <<>>సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఇంటి పనులు ప్రారంభించారు. అప్పులు, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.