News September 1, 2024
నెల్లూరు: 24 మంది ASI (సివిల్)లకు SI లుగా పదోన్నతి
నెల్లూరు జిల్లాలో పని చేస్తున్న 24 మంది ASI (సివిల్)లకు SI లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది సంక్షేమం, శాఖాపరమైన సౌకర్యాల పరంగా పోలీస్ శాఖలో ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. పదోన్నతి పొందిన ASIలు స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవాలన్నారు.
Similar News
News January 15, 2025
శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ
ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.
News January 14, 2025
శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ
శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.
News January 14, 2025
నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.