News September 1, 2024

AP&TGలో రెడ్ అలెర్ట్ ఉన్న జిల్లాలివే..

image

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. TGలో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, భువనగిరితో పాటు APలో ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మీ జిల్లాలో వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 7, 2025

బట్టతల రాబోతోందని గుర్తించడం ఎలాగంటే..

image

– హెడ్ టెంపుల్స్ (M షేప్) కన్పించడం (పై ఫొటో చూడండి)
– తల పైభాగం, పరిసరాల్లో జుట్టు పలుచబడటం
– కటింగ్/గుండు చేయించాక రీగ్రోత్ స్లో కావడం
– దువ్వినా/తలస్నానం చేసినా సాధారణం కంటే ఎక్కువగా హెయిర్ ఫాల్
> కొన్ని మెడిసిన్స్ వాడకం, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్, ఒత్తిడి, నిద్రలేమి, చర్మ సమస్యలు, పోషకాహార లోపంతో బట్టతల అవకాశాలు పెరుగుతాయి.
> సరైన చికిత్సతో కొంత ఫలితం ఉంటుంది.
Share It

News November 7, 2025

ప్రతీకా రావల్‌కు ప్రపంచకప్ మెడల్!

image

గాయం కారణంగా మహిళల ప్రపంచకప్ చివరి 2 మ్యాచ్‌లకు ప్రతీకా రావల్ <<18122584>>దూరమైన<<>> విషయం తెలిసిందే. ఆమె స్థానంలో స్క్వాడ్‌లోకి షెఫాలీ వర్మ రావడంతో ప్రతీకకు మెడల్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ICC ఛైర్మన్ జైషా చొరవ తీసుకున్నారు. ‘మెడల్ అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు జైషా నా మేనేజర్‌కు మెసేజ్ చేశారు. తర్వాత మెడల్ వచ్చేసింది. తొలిసారి దాన్ని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు’ అని ప్రతీక చెప్పారు.

News November 7, 2025

పోలీస్ ట్రైనింగ్‌లో ‘భగవద్గీత’.. విమర్శలు

image

ట్రైనీలు భగవద్గీత చదవాలని MP పోలీస్ ట్రైనింగ్ వింగ్ చెప్పడం చర్చనీయాంశమైంది. 8 పోలీస్ ట్రైనింగ్ స్కూళ్లలో రాత్రి మెడిటేషన్ సెషన్‌కు ముందు భగవద్గీతలోని ఒక చాప్టర్ చదవాలని ADGP రాజా బాబూ సింగ్ ఆదేశాలిచ్చారు. ట్రైనీలు ధర్మబద్ధంగా నడుచుకునేలా గీత గైడ్ చేస్తుందని ఆయన చెప్పారు. ఇది కాషాయీకరణ ప్రయత్నమని, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ మండిపడింది. పోలీసింగ్‌ను మెరుగుపరిచే వ్యాయామమని BJP సమర్థించింది.