News September 1, 2024

సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌వ‌ర్ సెంట‌ర్ లేదు: మ‌మ్ముట్టి

image

కోలీవుడ్‌లో ప‌వ‌ర్ సెంట‌ర్ అంటూ ఏం లేద‌ని న‌టుడు మమ్ముట్టి అన్నారు. జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక‌పై ఆర్టిస్టుల సంఘం స్పందించే వ‌ర‌కు తాను ఎదురుచూసిన‌ట్టు పేర్కొన్నారు. క‌మిటీ చేసిన స‌లహాలు, ప‌రిష్కారాల‌ను స్వాగ‌తించిన మ‌మ్ముట్టి ప‌రిశ్ర‌మ‌లో సంస్క‌ర‌ణ‌లు తేవ‌డానికి అన్ని సంఘాలు ఏకం కావాల‌ని కోరారు. పోలీసుల విచారణను ప్రతి ఒక్కరూ అనుమతించాలని, శిక్షలను కోర్టు నిర్ణయించనివ్వాల‌ని అన్నారు.

Similar News

News February 1, 2025

భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు

image

దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.

News February 1, 2025

కొండంత రాగం తీసి కూసంత పాట: షర్మిల

image

AP: బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 12మంది MPలు ఉన్న నితీశ్‌కు బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే, 21మంది MPలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకు చిప్ప చేతిలో పెట్టారన్నారు. ప్రత్యేక‌హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత అన్యాయం జరిగితే CM బడ్జెట్‌ను స్వాగతించడం హాస్యాస్పదమన్నారు.

News February 1, 2025

వసంత పంచమి.. అక్షరాభ్యాసం చేయిస్తున్నారా?

image

రేపు సరస్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన వసంత పంచమి. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యా బుద్ధులు వరిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. దేశంలో చాలా ప్రసిద్ధ సరస్వతి ఆలయాలున్నాయి. అందులో బాసర (తెలంగాణ) ఒకటి. ఆ తర్వాత శారద పీఠం (కశ్మీర్), శృంగేరి శారదాంబ ఆలయం (కర్ణాటక), సరస్వతి ఆలయం (పుష్కర్- రాజస్థాన్), కూతనూర్ సరస్వతి ఆలయం (తమిళనాడు), విద్యా సరస్వతి ఆలయం (వర్గల్-TG) ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు?