News September 1, 2024

ఇప్పుడు EC కూడా BJP కోసం పనిచేస్తోంది: కాంగ్రెస్

image

ED, CBI మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా BJP కోసం పని చేయడం ప్రారంభించిందని కాంగ్రెస్ విమర్శించింది. ఒక రాజకీయ పార్టీ డిమాండ్‌పై ఎన్నికల సంఘం ఏకంగా అసెంబ్లీ ఎన్నికల తేదీనే మార్చడం దురదృష్టకరమని ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. హరియాణాలో BJPని ఓటమి భయం వెంటాడుతోందని విమర్శించారు. ఈ ఆలస్యం పార్టీ ఎన్నికల సన్నాహకాలపై ప్రభావం చూపబోదని AICC ఇన్‌ఛార్జ్ దీపక్ అన్నారు.

Similar News

News February 13, 2026

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ

image

TG: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 11 చోట్ల గెలిచారు. BRS ఒక స్థానంలో విజయం సాధించింది. ఇదే జిల్లాలోని హాలియాలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ పదింట్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. BRS రెండు వార్డుల్లో విజయం సాధించింది. చండూరు, చిట్యాల మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

News February 13, 2026

ఎరాస్మస్ బౌలింగ్ కరెక్టేనా?

image

T20WCలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ విచిత్రమైన బౌలింగ్‌పై చర్చ మొదలైంది. ఇది గల్లీ త్రో బౌలింగ్‌లా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను అనుసరిస్తున్నారేమోనని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ICC 15 డిగ్రీల రూల్‌కు లోబడే అతని బౌలింగ్ ఉందని, మోచేయిని వంచడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా అతను(4W) భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.

News February 13, 2026

వీడని AI భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. AI భయాలు ఐటీ రంగాన్ని వీడకపోవడం మొత్తం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 823 పాయింట్లు నష్టపోయి 82,851 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు కుంగి 25,541 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, ఎయిర్‌టెల్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, TCS, HCL టెక్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ భారీ నష్టాల్లో ఉన్నాయి.