News September 1, 2024

భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

image

AP: విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందువల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ తక్షణ కర్తవ్యమని తెలిపారు. రెండు హెలికాప్టర్లు, భారీగా బోట్లు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 15, 2025

పండుగ వేళ తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

image

AP: సంక్రాంతి వేళ పల్నాడు(D) అచ్చంపేట(M) చామర్రులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోయారు. గౌతుకట్ల కోటయ్య అనే వృద్ధుడు(80) అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత అతని కొడుకు గౌతుకట్ల నాగేశ్వరరావు, బావమరిది తెల్లమేకల నాగేశ్వరరావు మద్యం తాగారు. వెంటనే విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు.

News January 15, 2025

ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్

image

వచ్చే నెల నుంచి తెలంగాణలో వైన్స్‌లు, బార్లలో KF బీర్లు లభించకపోవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఆ బ్రాండ్ బీర్లు తయారుచేసే యునైటెడ్ బ్రూవరీ(UB) సంస్థ మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న స్టాక్ ఈనెలాఖరు వరకే వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు. ఆ తర్వాత వైన్స్ వద్ద కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవు. మరోవైపు లిక్కర్ సరఫరాపై UB కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

News January 15, 2025

రేపు ఈడీ విచారణకు కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.