News September 1, 2024

వర్షాల ఎఫెక్ట్.. ఒకే జిల్లాలో ఐదుగురు మృతి

image

TG: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో నలుగురు, విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలవగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. MHBD జిల్లాలో కారు కొట్టుకుపోయి డా.అశ్విని, వెంకటాపురంలో చేపల వేటకు వెళ్లిన నర్సయ్య, WGL జిల్లా గిర్నిబావి వాగులో చిక్కుకొని వజ్రమ్మ, MLG జిల్లా కాల్వపల్లి వాగులో పడి మల్లికార్జున్, HNK జిల్లా పరకాలలో విద్యుత్ షాక్‌తో యాదగిరి మృతి చెందారు.

Similar News

News February 2, 2025

ఉప్పు గనుల్లో ఉంచి చికిత్స చేస్తారు!

image

ఆస్తమా రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తోంది ఉక్రెయిన్. అక్కడున్న ఉప్పు గనుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్ట్ ఉబ్బసం రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. గనిలోని అధిక ఉప్పు సాంద్రత ఒక మైక్రోక్లైమేట్‌ను సృష్టించి ఊపిరితిత్తులను పొడిగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు గనిలోనే కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.

News February 1, 2025

భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు

image

దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.

News February 1, 2025

కొండంత రాగం తీసి కూసంత పాట: షర్మిల

image

AP: బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 12మంది MPలు ఉన్న నితీశ్‌కు బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే, 21మంది MPలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకు చిప్ప చేతిలో పెట్టారన్నారు. ప్రత్యేక‌హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత అన్యాయం జరిగితే CM బడ్జెట్‌ను స్వాగతించడం హాస్యాస్పదమన్నారు.