News September 1, 2024
నడిగూడెం వరద పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ

నడిగూడెం మండలంలో వరద పరిస్థితులను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. మట్టి రోడ్డులో స్థానికులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆయన ప్రయాణించారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Similar News
News October 31, 2025
NLG: నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ

సికింద్రాబాద్ నుంచి BNG మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మొంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను NLG రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ రైళ్లు BNG మీదుగా వెళ్లే అవకాశం ఉంది.
News October 31, 2025
నల్గొండ జిల్లాలో 30.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం

మోంథా కారణంగా జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30.4 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కురిసింది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 130.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. చిట్యాల 44.1, నార్కట్పల్లి 41.5, కట్టంగూరు 41.1, నకిరేకల్ 54.5, కేతేపల్లి 56.7, మునుగోడు 36.3, చండూర్ 36.3, మర్రిగూడ 49.1, నేరెడుగొమ్ము 36.0, 37.6, దేవరకొండ 47.0, చందంపేట 46.0, గట్టుప్పల్లో 47.0 మిల్లీమీటర్లు రికార్డ్ అయ్యింది.
News October 30, 2025
మిర్యాలగూడ: చివరి ధాన్యం గింజ వరకూ కొంటా: కలెక్టర్

ఈ ఖరీఫ్‌లో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం రైస్ మిల్లు తనిఖీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని తెలిపారు. రైస్ మిల్లర్లు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె అన్నారు.


