News September 1, 2024
VZM:భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్

జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్ గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉండే గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ వర్షం పడే సమయంలో చెట్ల దగ్గరకు వెళ్లకండి
➤ తడిగా ఉండే స్తంభాలను పట్టుకోకండి
➤ నదులు, కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ విజయనగరం కంట్రోల్ రూమ్ నెం.08922 236947, మన్యం జిల్లా 08963 293046
Similar News
News March 2, 2026
సంగాం: రేపు సంగమేశ్వర స్వామి ఆలయం మూసివేత

జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సంగాం సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రేపు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తలుపులను మూసివేస్తామని బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆలయ చైర్మన్ బోను ఆనందరావు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతి రావు కోరారు.
News March 2, 2026
VZM: రబీ సీజన్‌కు యూరియా కొరత లేదు

రబీ సీజన్ 2025-26కు జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అవసరమైన యూరియాలో ఎక్కువ భాగం సరఫరా కాగా, 5,398 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులు మట్టి పరీక్ష ఆధారంగా సమతుల ఎరువులు వినియోగించాలని సూచించారు.
News March 2, 2026
VZM: అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు

అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరు చేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. మొదటి విడత మంజూరు చేసిన అక్రిడేషన్ కార్డులను తమ ఛాంబర్లో అక్రిడేషన్ కమిటీ సభ్యులకు సోమవారం కలెక్టర్ అందజేశారు. మిగిలిపోయిన పాత్రికేయులకు రెండో విడతలో అక్రిడేషన్లను మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్దిలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.


