News September 1, 2024
జేఎన్టీయూ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను 5వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.
Similar News
News November 8, 2025
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT
News November 8, 2025
హైదరాబాద్ మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌవరం

మిథాలి రాజ్.. హైదరాబాదీ మాజీ క్రికెటర్.. మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన గొప్ప క్రీడాకారిణి. వివిధ మ్యాచ్‌లో గెలిపించి భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న బ్యాట్స్ ఉమెన్.. ఇప్పడు మిథాలికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో జరిగిన సమావేశంలో మిథాలికి ఐసీసీ ఉమెన్ క్రికెట్ కమిటీలో చోటు కల్పించింది. దీంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 8, 2025
జూబ్లీ బైపోల్: చనిపోయిన ఓటర్ల వివరాల సేకరణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి వివిధ పార్టీల కార్యకర్తలు మరణించిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతమంది మరణించారు.. ఎంతమందికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ రోజు ఎవరైనా మృతి చెందిన ఓటరు పేరున వచ్చి ఓటు వేసే ప్రమాదముండటంతో ముందుజాగ్రత్త చర్యగా.. పోలింగ్ కేంద్రంలో అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.


