News September 1, 2024
కుక్కల్ని పెంచుకుంటున్నారా.. ఈ జాతి కుక్కలతో జాగ్రత్త!
పెంపుడు కుక్కలకు చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వాటి స్వభావంలో వచ్చే మార్పులు మనకి, పిల్లలకు మంచివి కాదని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి బ్రీడ్‌లను పెంచుకోవద్దని సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా రోట్వీలర్, చౌ చౌ, జాక్ రస్సెల్ టెర్రియర్, చివావా, అకితా, పెకింగీస్, షి త్జు, బుల్‌మాస్టిఫ్, డాబర్‌మాన్, గ్రేహౌండ్ వంటి జాతులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Similar News
News February 2, 2025
టెన్త్ విద్యార్థులకు ‘స్నాక్స్’ ప్రారంభం
TG: ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించే కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ వరకు దీనిని ప్రభుత్వం అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు, బెల్లం, మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, శనగలు, ఉల్లిపాయ పకోడి రోజుకొక రకం ఇవ్వనున్నారు. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు స్నాక్స్ అందిస్తున్నారు.
News February 2, 2025
CTలో రోహిత్, కోహ్లీలది కీలక పాత్ర: గంభీర్
ఇటీవల ఇంటర్నేషన్ క్రికెట్‌తోపాటు రంజీ ట్రోఫీలోనూ విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కోచ్ గంభీర్ వెనకేసుకొచ్చారు. వారు డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా జట్టుకు ఎంతో విలువను చేకూరుస్తారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్ద పాత్రను పోషించబోతున్నారన్నారు. వారిద్దరికీ పరుగుల దాహం ఉందని, దేశం కోసం ఉత్తమ ప్రదర్శన చేయడానికి ఆరాటపడుతుంటారని పేర్కొన్నారు. CTలో ప్రతి గేమ్ తమకు ముఖ్యమేనని తెలిపారు.
News February 2, 2025
English Learning: Antonyms
✒ Fabricate× Destroy, Dismantle
✒ Fanatical× Liberal, Tolerant
✒ Falter× Persist, Endure
✒ Ferocious× Gentle, Sympathetic
✒ Feeble× Strong, Robust
✒ Fluctuate× Stabilize, resolve
✒ Feud× Harmony, fraternity
✒ Fragile× Enduring, Tough
✒ Forsake× Hold, maintain