News September 2, 2024
NLG: 498 ఎకరాల్లో నీట మునిగిన పంట

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 4 మండలాల్లో 498ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. వాడపల్లిలో పత్తి 20 ఎకరాలు, వరి 100 ఎకరాలు, మాడ్గులపల్లి మండలం కాల్వపల్లిలో వరి 2 ఎకరాలు, వేములపల్లి, శెట్టిపాలెం, రావుల పెంటలో 350 ఎకరాల్లో వరి, గుర్రంపోడు మండలం రేపల్లెలో మిరప 3 ఎకరాలు, పెద్దవూరలోని చలకుర్తిలో 3 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు తెలిపారు.
Similar News
News January 20, 2026
NLG: మున్సిపల్ పోరు.. పెరగనున్న మహిళల ప్రాతినిధ్యం

మున్సిపల్ ఎన్నికల వేళ ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్ల లెక్కలు మారాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది మహిళలకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా జనరల్ మహిళా స్థానాలు 5 నుంచి 7కు పెరగడం విశేషం. అయితే, బీసీ మహిళలకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. గతంలో 3 స్థానాలుండగా ఈసారి వాటిని 2కే పరిమితం చేశారు. ఇక SC మహిళలకు గతంలో లాగే ఒక స్థానాన్ని కేటాయించారు. ఈ మార్పులు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపనున్నాయి.
News January 19, 2026
నల్గొండ: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.
News January 19, 2026
నల్గొండ: ఇంటర్ కాలేజీలకు నిధులు మంజూరు

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


