News September 2, 2024
నీటమునిగిన హోంమంత్రి నివాసం
AP: విజయవాడలోని హోంమంత్రి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో తన పిల్లలను ఓ ట్రాక్టర్‌లో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి నివాసం ఉండే కాలనీ అంతా జలదిగ్బంధం అయింది. కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మంత్రి అనిత సహాయక చర్యలు చేపడుతున్నారు.
Similar News
News February 2, 2025
వసంత పంచమి ఎప్పుడు? క్లారిటీ
వసంతి పంచమి ఇవాళా? రేపా? అని ప్రజల్లో ఉన్న సందిగ్ధతపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ‘ఇవాళ ఉ.9.45 గంటల వరకు చవితి తిథి ఉంది. ఆ తర్వాత పంచమి మొదలవుతుంది. రేపు ఉ.6.50 నిమిషాలకు సూర్యోదయం ఉంటే, పంచమి తిథి ఉ.6.52 వరకు మాత్రమే ఉంది. కేవలం 2 నిమిషాలకు పర్వదినాన్ని నిర్ణయించలేం. అందుకే 2వ తేదీనే పండుగ చేసుకోవాలి. ఇవాళ ఉ.7:09 గంటల నుంచి మ.12:35 గంటల వరకు పూజకు మంచి సమయం’ అని చెబుతున్నారు.
News February 2, 2025
వసంత పంచమి: ఏం చేయాలి?
✒ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి. సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.
✒ ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.
✒ ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
✒ ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.
News February 2, 2025
హోమ్ లోన్ తీసుకునే వారికి వడ్డీ సబ్సిడీ
2025-26లో హోం లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేసే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 10 లక్షల మందికి వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద ప్రయోజనం చేకూర్చనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ₹3,500Cr కేటాయించింది. ఎలా? ఏ విధంగా లబ్ధి కలిగిస్తుందనేది వెల్లడించలేదు. PMAY(అర్బన్)కు ₹19,794Cr, PMAY(గ్రామీణ్)కు ₹54,832Cr ఇచ్చింది. 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.