News September 2, 2024
FLASH: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

AP: శ్రీశైలం గేట్లు ఎత్తుతుండగా సాంకేతిక సమస్య ఎదురైంది. 2, 3 గేట్ల ప్యానల్‌లో బ్రేక్ కాయిల్ కాలిపోయింది. వరద ఉద్ధృతితో గేట్లను మరింత పైకి ఎత్తుతుండగా ఈ ఘటన జరిగింది. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News December 25, 2025
వార్నర్ రికార్డు సమం చేసిన రోహిత్

సుమారు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భారీ శతకంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచులో 155 పరుగులు చేసిన హిట్ మ్యాన్ లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సార్లు 150+ స్కోర్ చేసిన ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్(9) రికార్డును సమం చేశారు. అంతేకాకుండా అనుస్తుప్ మజుందార్(39y-బెంగాల్) తర్వాత VHTలో శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్(38y 238d) నిలిచారు.
News December 25, 2025
త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్‌గానే ఉంటుందని, ఇన్‌బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్‌తో లింకైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.
News December 25, 2025
బాబువన్నీ చిల్లర రాజకీయాలే: కాకాణి

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు కోటి సంతకాలు చేసినా CM లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని YCP నేత కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. ‘పేదలకు మేలు చేసేలా జగన్ వైద్యరంగాన్ని అభివృద్ధి చేశారు. వాటిని నీరుగార్చి ప్రైవేటుతో మేలుచేస్తానంటే ఎవరూ నమ్మరు. ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ నావి హుందా పాలిటిక్స్ అని CBN అనడం హాస్యాస్పదం’ అని ఎద్దేవా చేశారు.


