News September 2, 2024
భూమిని సమీపిస్తున్న గ్రహశకలం.. ప్రమాదమా?
భారీ గ్రహశకలం ఒకటి భూమికి అత్యంత సమీపంగా వస్తోందని సమాచారం. దీని పరిమాణం 720 అడుగులు. అంటే 2 ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. పేరు 2024 ON. సెప్టెంబర్ 15న భూమికి 6,20,000 మైళ్ల సమీపం నుంచి వెళ్లనుంది. అంత దూరమైతే దగ్గర అంటారేంటి అనేగా మీ డౌట్. అంతరిక్ష శాస్త్రం కొలతలను బట్టి ఇది దగ్గరే. చంద్రుడి కన్నా భూమికి 2.6 రెట్లు ఎక్కువ దూరంగా వెళ్తుంది కాబట్టి మనకేమీ ప్రమాదం లేనట్టే.
Similar News
News December 30, 2024
యూట్యూబ్‌లో టెన్త్ పేపర్.. నిందితుడు అరెస్ట్
AP: టెన్త్ హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లను యూట్యూబ్‌లో <<14900742>>అప్‌లోడ్ చేసిన<<>> అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను అరుణ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను రద్దు చేసి ఈ నెల 20న నిర్వహించారు.
News December 30, 2024
కెరీర్‌లోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు
టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ ఏడాది 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. 2013లో 66.60, 2014లో 26.33, 2015లో 25.07, 2016లో 57.60, 2017లో 217, 2018లో 26.28, 2019లో 92.66, 2021లో 47.68, 2022లో 30, 2023లో 41.92 యావరేజ్‌తో రన్స్ చేశారు.
News December 30, 2024
vitamin D దొరికే ఫుడ్స్ ఇవే
ఒంటికి మేలు చేసే <<15021724>>vitamin D<<>> ఆహారంలో కన్నా సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం పడే ఎండలో వాకింగ్, ఎక్సర్‌సైజులు చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇక సాల్మన్, సార్డైన్స్, హెర్రింగ్, మాకెరెల్ వంటి చేప నూనెలో బాగా దొరుకుతుంది. రెడ్ మీట్, లివర్, కోడిగుడ్డు సొన, కొన్ని తృణ ధాన్యాల్లోనూ లభిస్తుంది. వైద్యులు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు vitamin D సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.