News September 2, 2024
‘పెర్త్’ తరహాలో అనంతపురం పిచ్!

మరో మూడ్రోజుల్లో అనంతపురం వేదికగా దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ నెల 5న జరగనున్న తొలి మ్యాచ్‌లో C, D జట్లు తలపడతాయి. ఈ టోర్నీకి వేదిక కానున్న RDT మైదానంలోని పిచ్ ఆస్ట్రేలియాలోని ‘పెర్త్’ను పోలి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమట. ఈ గ్రౌండ్‌లో 2004 నుంచి 2013 వరకు 15 మ్యాచులు జరగ్గా పేసర్లు 345, స్పిన్నర్లు 96 వికెట్లు తీశారు.
Similar News
News March 5, 2026
సీఎంతో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

అమరావతి ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతపురం ప్రగతికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం కీలక దిశానిర్దేశం చేశారు.
News March 5, 2026
బెంబేలెత్తుతున్న అనంతపురం జిల్లా ప్రజలు

మధ్యాహ్నం ఎండలు, రాత్రి ఉక్కపోతతో అనంత జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల 1న దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. బుధవారం 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. గుంతకల్లు మండలంలో 39.8, యల్లనూరులో 38.4, పెద్దపప్పూరులో 38.3, తాడిపత్రిలో 37.7, బి.సముద్రంలో 37.6 డిగ్రీలు నమోదయ్యాయి.
News March 4, 2026
‘జనగణనను పారదర్శకంగా నిర్వహించండి’

అనంతపురం జిల్లా జనగణనను అధికారులు, సిబ్బంది బాధ్యతగా చేపట్టాలని డిఆర్ఓ, జిల్లా సెన్సెస్ అధికారి మలోలా సూచించారు. జేఎన్టీయూలో జరిగిన శిక్షణలో డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు. సీఎంఎంఎస్ ద్వారా 33 అంశాల నమోదు, మొబైల్ యాప్ వినియోగంపై వివరించారు. ఎక్కడా లోపాలు లేకుండా జనగణన పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.


