News September 2, 2024
1983 WC విజేత ఇంట విషాదం
టీమ్ఇండియా మాజీ ప్లేయర్, 1983 వరల్డ్ కప్ విజేత కీర్తి ఆజాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పూనమ్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆజాద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. పూనమ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆజాద్ TMC నుంచి ఎంపీగా ఉన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు పూనమ్ మృతికి నివాళులర్పించారు.
Similar News
News February 2, 2025
రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్
యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై కేరళలోని ఓ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రామ్‌దేవ్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు రావాలని ఆదేశించినా వారు రాకపోవడంతో కోర్టు తాజా తీర్పునిచ్చింది.
News February 2, 2025
వైరస్: లక్షల సంఖ్యలో కోళ్లు మృతి
AP: ఉమ్మడి ప.గో. జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ DECలో మొదలై JAN నుంచి విజృంభిస్తోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. 2012, 20లోనూ ఈ వైరస్ వచ్చిందని, ప్రభుత్వం విపత్తుగా పరిగణించాలని కోరుతున్నారు. అటు ఖమ్మం జిల్లాలోనూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.
News February 2, 2025
ఎమ్మెల్యేల భేటీ నిజమే.. కానీ రహస్యంగా కాదు: అనిరుధ్ రెడ్డి
TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘ఎమ్మెల్యేల సమావేశం నిజమే. కానీ మేమేం రహస్యంగా భేటీ కాలేదు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవద్దా? నేను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు. సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీని కలిశాక పూర్తి వివరాలు చెబుతా’ అని స్పష్టం చేశారు.