News September 2, 2024
తిరుమలలో కొండపై బైక్‌లపై ఆంక్షలు

తిరుమలలో అక్టోబర్ 8న గరుడ సేవ దృష్ట్యా ఘాట్ రోడ్డులో బైక్‌లపై ఆంక్షలు విధిస్తున్నట్లు సోమవారం టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. భారీ రద్దీ కారణంగా అక్టోబర్ 7 రాత్రి 9 గంటల నుంచి 9 ఉదయం 6 గంటల వరకు బైక్‌లపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 11, 2026
చిత్తూరు: వాట్సాప్‌లో టెట్ ఫలితాలు

చిత్తూరు జిల్లాలో టెట్ రాసిన అభ్యర్థులు వాట్సాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరిగాయని చెప్పారు. టెట్ రాసిన అభ్యర్థులు 9552300009 నంబర్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చని డీఈవో వెల్లడించారు.
News January 10, 2026
చిత్తూరు: ఘనంగా ప్రారంభమైన తైక్వాండో పోటీలు

ఐదో అంతర్ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్-2026 పోటీలు చిత్తూరు మెసానికల్ గ్రౌండ్లో ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. గ్రాండ్ మాస్టర్ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో ఏపీ, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.
News January 10, 2026
చిత్తూరులో రేపు వడ్డే ఓబన్న జయంతి

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు జయంతి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానునట్లు పేర్కొన్నారు.


