News September 2, 2024

ఖమ్మం చేరుకున్న రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. జరిగిన నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇవాళ రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. రేపు మహబూబాబాద్, వరంగల్‌లో పర్యటిస్తారు.

Similar News

News February 2, 2025

రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్

image

యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై కేరళలోని ఓ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రామ్‌దేవ్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు రావాలని ఆదేశించినా వారు రాకపోవడంతో కోర్టు తాజా తీర్పునిచ్చింది.

News February 2, 2025

వైరస్: లక్షల సంఖ్యలో కోళ్లు మృతి

image

AP: ఉమ్మడి ప.గో. జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ DECలో మొదలై JAN నుంచి విజృంభిస్తోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. 2012, 20లోనూ ఈ వైరస్ వచ్చిందని, ప్రభుత్వం విపత్తుగా పరిగణించాలని కోరుతున్నారు. అటు ఖమ్మం జిల్లాలోనూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.

News February 2, 2025

ఎమ్మెల్యేల భేటీ నిజమే.. కానీ రహస్యంగా కాదు: అనిరుధ్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘ఎమ్మెల్యేల సమావేశం నిజమే. కానీ మేమేం రహస్యంగా భేటీ కాలేదు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవద్దా? నేను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు. సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీని కలిశాక పూర్తి వివరాలు చెబుతా’ అని స్పష్టం చేశారు.