News September 2, 2024
స్వాతి మాలీవాల్ కేసులో బిభవ్‌కు బెయిల్

ఆప్ MP స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ఢిల్లీ CM సహాయకుడు బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్య కాంత్ బెంచ్ సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారించింది. ‘మాలీవాల్‌కు అయినవి చిన్న గాయాలే. ఇది బెయిల్‌కు తగిన కేసు. మీరు(పోలీసులు) బెయిల్‌ను వ్యతిరేకించలేరు. ఇలాంటి కేసులో ఒక వ్యక్తిని జైలులో ఉంచలేరు. ఇప్పటికే 100 రోజులు దాటింది’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
Similar News
News January 14, 2026
నేడే జ్యోతి దర్శనం.. కిక్కిరిసిన శబరిగిరులు

అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది. సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
News January 14, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ 2 డేస్ కలెక్షన్లు ఎంతంటే?

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో రూ.120కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. తొలి రోజు ప్రీమియర్స్‌తో కలిపి రూ.84కోట్లు సాధించిన విషయం తెలిసిందే. మూవీకి పాజిటివ్ టాక్ రావడం, పండుగ సెలవుల నేపథ్యంలో ఈ వారం కలెక్షన్లు భారీగా పెరిగే ఛాన్సుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
News January 14, 2026
ఈ భోగి ఎంతో స్పెషల్.. మళ్లీ 2040 వరకు రాదు!

ఇవాళ మనం జరుపుకుంటున్న భోగి ఎంతో విశిష్టమైంది. నేడు షట్తిల ఏకాదశి. భోగి పండగ రోజు ఏకాదశి తిథి రావడమే దీని ప్రత్యేకత. ఇలా మళ్లీ 2040 వరకు జరగదు. షట్తిల ఏకాదశి రోజు నువ్వులు దానం చేయాలి. వీటితో పాటు బెల్లం, దుస్తులు, నెయ్యి, ఉప్పు, చెప్పులు, దుప్పట్లు దానమిస్తే మంచిది. ఇవాళ ఉపవాసం ఉంటే భగవంతుడి కృపతో కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.


