News September 2, 2024
అల్లూరి జిల్లాలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్

అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పిఓ అభిషేక్ తనిఖీ చేశారు. విద్యార్థుల అదృశ్యం పట్టించుకోకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్, కుక్‌లకు పీఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులుగా విద్యార్థులు బయట ఉంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపంపై డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూఓ తిరుపాల్‌లను మందలించారు.
Similar News
News January 15, 2026
సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.
News January 15, 2026
గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 13, 2026
కేజీహెచ్‌లో నాలుగు నెలల్లో 100 క్యాన్సర్ ఆపరేషన్లు

కేజీహెచ్‌లో వివిధ రకాల క్యాన్సర్లకు అత్యాధునిక ట్రీట్మెంట్ జరుగుతోందని విభాగాధిపతి ఎమ్మెస్ శ్రీనివాస్ తెలిపారు. 4 నెలల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి కేజీహెచ్‌లో సిటీ ఇమ్యులేటర్, ఎక్సలేటర్ క్యాన్సర్ గడ్డలు కనుగొనే పరికరాన్ని ప్రారంభించారు. ఈ పరికరంతో ఏడు జిల్లాల నుంచి వస్తున్న రోగులు, ఒరిస్సా నుంచి వచ్చిన దాదాపు 100 మందికి ఆపరేషన్లు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణీ పేర్కొన్నారు.


