News September 2, 2024

ALERT.. బయటకు రావొద్దు: GHMC

image

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో GHMC అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించింది. వాహనదారులు, పాదచారులు రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరింది.

Similar News

News February 2, 2025

రంజీలో వివాదం: బ్యాటింగ్ చేసేందుకు జమ్మూకశ్మీర్ నిరాకరణ

image

బరోడా, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆతిథ్య బరోడా జట్టు పిచ్‌ను రెండో రోజు రాత్రి మార్చేసిందని ఆరోపిస్తూ JK జట్టు 3వ రోజు బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించింది. దీంతో సుమారు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. మల్లగుల్లాల అనంతరం ఎట్టకేలకు బ్యాటింగ్ ఆడింది. చివరికి మ్యాచ్‌ను కశ్మీర్ 182 పరుగుల తేడాతో గెలిచింది.

News February 2, 2025

రూ.12,500 కోట్లు తిరిగివ్వనున్న రక్షణ శాఖ.. ఎందుకంటే

image

గత ఏడాది బడ్జెట్లో తమకు చేసిన కేటాయింపుల్లో రూ.12,500 కోట్లను రక్షణ శాఖ కేంద్రానికి తిరిగివ్వనుంది. డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్ చేపట్టిన పలు కొనుగోళ్లు వివిధ కారణాలతో జాప్యం కావడంతో వాటి కోసం కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. ఆ నిధుల్ని ప్రభుత్వానికి తిరిగిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ శాఖకు కేంద్రం కేటాయించింది.

News February 2, 2025

CM రేవంత్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపించాలి: RS ప్రవీణ్

image

TG: KCR శారీరక స్థితి గురించి ఇటీవల CM రేవంత్ చేసిన <<15322522>>వ్యాఖ్యలపై<<>> BRS నేత RS.ప్రవీణ్ మండిపడ్డారు. ‘రేవంత్ మానసిక స్థితిపై అనుమానాలున్నాయి. ఆయన మాటలు చూస్తుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్ రోగి లక్షణాలుగా కనిపిస్తున్నాయి. CM బాధ్యతలు ఎవరికైనా తాత్కాలికంగా అప్పజెప్పి వారిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపిస్తే బాగుంటుందేమో. దీని గురించి వారి ఫ్యామిలీ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.