News September 2, 2024
మరో రెండు జిల్లాల్లో రేపు సెలవు ప్రకటన
AP: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని మరో రెండు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటికే గుంటూరు జిల్లాలో <<14002872>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 2, 2025
ఆ హీరోను అన్నయ్య అని పిలుస్తా: కీర్తి సురేశ్
మలయాళ హీరో దిలీప్‌తో చిన్నతనంలో కూతురు పాత్రలో నటించినట్లు హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపారు. ఆ తర్వాత ఆయనను అంకుల్ అని పిలిచినట్లు చెప్పారు. కొన్నేళ్లకు ఆయనకు గర్ల్ ఫ్రెండ్ రోల్‌లో నటించగా ఆ సమయంలో అంకుల్ అని కాకుండా అన్నయ్య అని పిలవాలని దిలీప్ చెప్పినట్లు వెల్లడించారు. ఇక అప్పటినుంచి ఆయనను చేటా(అన్నయ్య) అని పిలుస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
News February 2, 2025
రంజీలో వివాదం: బ్యాటింగ్ చేసేందుకు జమ్మూకశ్మీర్ నిరాకరణ
బరోడా, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆతిథ్య బరోడా జట్టు పిచ్‌ను రెండో రోజు రాత్రి మార్చేసిందని ఆరోపిస్తూ JK జట్టు 3వ రోజు బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించింది. దీంతో సుమారు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. మల్లగుల్లాల అనంతరం ఎట్టకేలకు బ్యాటింగ్ ఆడింది. చివరికి మ్యాచ్‌ను కశ్మీర్ 182 పరుగుల తేడాతో గెలిచింది.
News February 2, 2025
రూ.12,500 కోట్లు తిరిగివ్వనున్న రక్షణ శాఖ.. ఎందుకంటే
గత ఏడాది బడ్జెట్లో తమకు చేసిన కేటాయింపుల్లో రూ.12,500 కోట్లను రక్షణ శాఖ కేంద్రానికి తిరిగివ్వనుంది. డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన పలు కొనుగోళ్లు వివిధ కారణాలతో జాప్యం కావడంతో వాటి కోసం కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. ఆ నిధుల్ని ప్రభుత్వానికి తిరిగిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ శాఖకు కేంద్రం కేటాయించింది.