News September 2, 2024
భారీ వర్షాలు.. ప్రభుత్వ సాయం పెంపు

TG: భారీ వర్షాలు, వరదలకు పశువులు మరణిస్తే ఇచ్చే పరిహారం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాడి గేదెలు చనిపోతే ఒక్కో దానికి రూ.50వేలు, గొర్రెలు, మేకలకు రూ.5వేల చొప్పున ఇవ్వాలన్నారు. అలాగే పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ.10వేల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు సాయం అందించాలన్నారు.
Similar News
News October 17, 2025
జనసేన వినూత్న కార్యక్రమం: పవన్ కళ్యాణ్

AP: రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు “సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం” అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీని ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని చెప్పారు. పూర్తి వివరాలకు జనసేన పార్టీ <
News October 17, 2025
RCBని అమ్మేయాలని ప్రయత్నాలు?

IPL: RCBని $2 బిలియన్లకు అమ్మేందుకు పేరెంట్ కంపెనీ Diageo ప్రయత్నాలు చేస్తోందని Cricbuzz తెలిపింది. IPLలో లిక్కర్ బ్రాండ్ల యాడ్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన రూల్స్ తేవడంతో లాభదాయకం కాదని భావిస్తున్నట్లు సమాచారం. అధార్ పూనావాలా (సీరమ్ ఇన్‌స్టిట్యూట్), పార్థ్ జిందాల్ (JSW గ్రూప్), అదానీ గ్రూప్, ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ, మరో రెండు అమెరికా ప్రైవేట్ సంస్థలు ఆర్సీబీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట.
News October 17, 2025
ONGCలో 2,623 అప్రెంటీస్ ఖాళీలు

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 6. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వెబ్‌సైట్: <