News September 2, 2024

విజయవాడలో హెల్ప్ లైన్ నంబర్లు

image

AP: వరద ఉద్ధృతితో నీట మునిగిన విజయవాడలో బాధితుల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. 8181960909, 0866-2424172, 0866-2575833, 18004256029 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అటు వరద బాధితుల కోసం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 81 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్ ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు.

Similar News

News February 2, 2025

ఆ హీరోను అన్నయ్య అని పిలుస్తా: కీర్తి సురేశ్

image

మలయాళ హీరో దిలీప్‌తో చిన్నతనంలో కూతురు పాత్రలో నటించినట్లు హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపారు. ఆ తర్వాత ఆయనను అంకుల్ అని పిలిచినట్లు చెప్పారు. కొన్నేళ్లకు ఆయనకు గర్ల్ ఫ్రెండ్ రోల్‌లో నటించగా ఆ సమయంలో అంకుల్ అని కాకుండా అన్నయ్య అని పిలవాలని దిలీప్ చెప్పినట్లు వెల్లడించారు. ఇక అప్పటినుంచి ఆయనను చేటా(అన్నయ్య) అని పిలుస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

News February 2, 2025

రంజీలో వివాదం: బ్యాటింగ్ చేసేందుకు జమ్మూకశ్మీర్ నిరాకరణ

image

బరోడా, జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆతిథ్య బరోడా జట్టు పిచ్‌ను రెండో రోజు రాత్రి మార్చేసిందని ఆరోపిస్తూ JK జట్టు 3వ రోజు బ్యాటింగ్ చేసేందుకు నిరాకరించింది. దీంతో సుమారు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. మల్లగుల్లాల అనంతరం ఎట్టకేలకు బ్యాటింగ్ ఆడింది. చివరికి మ్యాచ్‌ను కశ్మీర్ 182 పరుగుల తేడాతో గెలిచింది.

News February 2, 2025

రూ.12,500 కోట్లు తిరిగివ్వనున్న రక్షణ శాఖ.. ఎందుకంటే

image

గత ఏడాది బడ్జెట్లో తమకు చేసిన కేటాయింపుల్లో రూ.12,500 కోట్లను రక్షణ శాఖ కేంద్రానికి తిరిగివ్వనుంది. డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్ చేపట్టిన పలు కొనుగోళ్లు వివిధ కారణాలతో జాప్యం కావడంతో వాటి కోసం కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. ఆ నిధుల్ని ప్రభుత్వానికి తిరిగిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ శాఖకు కేంద్రం కేటాయించింది.