News September 2, 2024

సిరిసిల్ల మళ్లీ ఉరిశలగా మారుతుంది: కేటీఆర్

image

పదేళ్లపాటు సిరిసంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిశలగా మారుతోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల పట్ల అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురుతీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతన్నలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు.

Similar News

News July 8, 2025

ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు

image

కరీంనగర్‌లో రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ముగిసినట్లు CP గౌస్ ఆలం మంగళవారం తెలిపారు.సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబాటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి వరంగల్‌లో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

News July 8, 2025

పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

image

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

News July 8, 2025

చేప పిల్లల ఉత్పత్తిలో కరీంనగర్ ప్రథమం: మంత్రులు

image

కరీంనగర్ ఉజ్వల పార్క్ సమీపంలోని చేప పిల్లల పెంపక కేంద్రాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సోమవారం సందర్శించారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రంలో కరీంనగర్ చేప పిల్లల పెంపకంలో ప్రథమస్థానంలో ఉందని అన్నారు. స్థానికంగా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నామని, భవిష్యత్‌లో మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.