News September 2, 2024
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎంపీ బలరాం నాయక్ పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలతో ఎంపీ మాట్లాడి ప్రజలకు ధైర్యం చెప్పి నిత్యం అండగా ఉంటామని చెప్పారు. వరదల వల్ల తెగిపోయిన రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఎంపీ కోరారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2024
ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు
గుమ్మడూరు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కృతజ్ఞత పూర్వకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డి.రాజేష్ మాట్లాడుతూ.. ప్రజల కొన్నేళ్ల తపస్సు త్యాగం, సామర్థ్యాల ఫలితమే రాజ్యంగమని, ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
News November 26, 2024
వరంగల్: భారీగా తగ్గిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు పత్తి భారీగా తరలి వచ్చింది. అయితే ధర మాత్రం నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా.. నేడు రూ.6770కి పడిపోయింది. ధరలు భారీగా పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.
News November 26, 2024
దుగ్గొండి: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
దుగ్గొండి మండలంలో గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన కాపరి కోట మల్లయ్య అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయ భూమి వద్ద గొర్రెల మంద పెట్టాడు. సోమవారం రాత్రి అక్కడ ఉన్న తన కుమారుడికి ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మల్లయ్య మృతి చెందినట్లు చెప్పారు.