News September 3, 2024
నేటి ముఖ్యాంశాలు
* TG: ఖమ్మంలో పర్యటించిన సీఎం రేవంత్.. బాధితులకు పరిహారం పెంపు
* ఖమ్మం ప్రజలంతా ధైర్యంగా ఉండండి: టీజీ మంత్రులు
* BRS విజన్‌తోనే మరింత మెరుగ్గా హైదరాబాద్: KTR
* AP: సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే సహించం: CBN
* ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో 11.41 లక్షల క్యూసెక్కుల వరద
* బ్యారేజికి ఎలాంటి ముప్పు లేదు: మంత్రి నిమ్మల
* విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన జగన్
Similar News
News January 21, 2025
ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు
AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.
News January 21, 2025
6.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనాలు
AP: తిరుమలలో పది రోజుల పాటు శ్రీవారిని 6,83,304 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా రూ.34.43కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియగా, సోమవారం తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలను టీటీడీ ప్రారంభించింది.
News January 21, 2025
RTCకి సంక్రాంతి ఆదాయం రూ.115కోట్లు!
TG: సంక్రాంతి సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. 6వేల ప్రత్యేక బస్సుల ద్వారా అనధికార లెక్కల ప్రకారం రూ.115 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 5వేల బస్సులు నడపగా, రూ.99కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ నెల 10-12, 19,20 తేదీల్లో TGSRTC బస్సుల్లో 50శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో అధికారిక లెక్కలు వెలువడనున్నాయి.