News September 3, 2024
ఆపత్కాలం.. సాయం చేయండి: కాకినాడ కలెక్టర్

నిరాశ్రయులైన వరద బాధితులకు సహాయం అందించాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. స్వచ్ఛందంగా సహాయం చేయదలచిన వారు కాకినాడ కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారికి నగదు రూపంలో కానీ, చెక్కు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ సహాయం అందజేయవచ్చునని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 3, 2025
మోరంపూడి ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి

మోరంపూడి ఫ్లైఓవర్ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
News December 3, 2025
రాజమండ్రి కమిషనర్‌కు చంద్రబాబు అభినందన

కేంద్ర ప్రభుత్వం నుంచి ‘జల్ సంచాయ్-జన్ భాగీధారి’ అవార్డును అందుకున్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పర్యటనకు వచ్చిన ఆయన అవార్డును చూసి కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేస్తే ఇలాంటి అవార్డులు మరెన్నో వస్తాయని ఆయన అన్నారు. సమిష్టి కృషివల్లే ఇలాంటి అవార్డులు సాధ్యమవుతాయన్నారు.
News December 3, 2025
రాజమండ్రి: నిర్మలా సీతారామన్‌కు MP పురంధేశ్వరి రిక్వెస్ట్!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, పంటకు సంబంధించిన పలు విషయాలను ఆమె వివరించారు. టొబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారానికి హామీ ఇచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు.


